మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెట‌ర్‌పై ఐదేళ్ల నిషేధం

Published on Fri, 08/15/2025 - 20:02

శ్రీలంక మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ సాలియా సమన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు అత‌డిపై ఐదేళ్ల 5 ఏళ్ల నిషేధాన్నిఐసీసీ  విధించింది. 

అబుదాబి టీ10 లీగ్ 2021లో మ్యాచ్‌లను ఫిక్సింగ్  చేసేందుకు స‌మ‌న్ ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు అప్ప‌టిలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌డిపై సెప్టెంబర్ 13, 2023న ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించబడింది. అయితే ఇప్పుడు ఆ కేసులో అత‌డిని ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. దీంతో  తొలుత విధించిన తేదీ నుంచే అత‌డి నిషేదం అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.

అంటే అత‌డు మ‌రో మూడున్నరేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడేందుకు వీలులేదు.  అత‌డిపై ఈసీబీ కోడ్‌లోని ఆర్టికల్స్ 2.1.1, 2.1.3,  2.1.4 కింద అభియోగాలు మోపబడ్డాయి. మ్యాచ్‌లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, గిప్ట్‌లు ఇస్తామ‌ని ఆశ‌చూప‌డం వంటివి ఈ ఆర్టిక‌ల్స్ ఉల్లంఘనకు కింద‌కు వ‌స్తాయి.

సమన్ తన దేశీయ కెరీర్‌లో 101 ఫస్ట్-క్లాస్,  77 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అత‌డి పేరిట 231 ఫ‌స్ట్‌క్లాస్ వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా 101 మ్యాచ్‌ల్లో 3,662 ప‌రుగులు చేశాడు. కాగా ఇదే కేసులో  బంగ్లాదేశ్ క్రికెటర్ నసీర్ హుస్సేన్‌పై కూడా ఐసీసీ అభియోగాలు మోపింది. అత‌డు ఇటీవ‌లే త‌న రెండేళ్ల నిషేదాన్ని పూర్తి చేస‌కుని తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు.
చదవండి: గిల్‌కు వారిద్ద‌రి స‌పోర్ట్ కావాలి.. లేదంటే క‌ష్ట‌మే: సురేష్‌ రైనా

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)