Breaking News

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ డేట్‌ వచ్చేసింది.. ఎప్పుడంటే

Published on Wed, 02/08/2023 - 15:19

ICC World Test Championship 2021 - 2023: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021- 23 సీజన్‌ ఫైనల్‌ తేదీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ వేదికగా జూన్‌ 7న ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం కానుందని పేర్కొంది. జూన్‌ 12ను రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్‌ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.

కివీస్‌దే తొలి ట్రోఫీ
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియాను ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక తాజా సీజన్‌లో ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో ఆస్ట్రేలియా, టీమిండియా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు టాప్‌-2లో ఉన్న ఈ రెండు పటిష్ట జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కీలకం కానుంది.

టీమిండియా- ఆసీస్‌ పోటాపోటీ
అయితే, ఆస్ట్రేలియా 136 పాయింట్ల(75.56 పర్సంటైల్‌)తో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్‌ 99 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సిరీస్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా సిరీస్‌ గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అలా అయితే కంగారూలకు కష్టాలు తప్పవు.

ప్రస్తుత సమీకరణల దృష్ట్యా ఆసీస్‌ దాదాపు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్నట్లనిపిస్తున్నా.. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్‌ల ఫలితాలు తేలే వరకు వేచి చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక, సౌతాఫ్రికా మిగిలిన సిరీస్‌లు ఆడిన తర్వాతే ఫైనలిస్టులకు సంబంధించి స్పష్టత వస్తుంది. 

ది ఓవల్‌ క్రికెట్‌ స్టేడియం
ఇక క్రికెట్‌ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ గతంలో ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఓవల్‌కు వేదికను మార్చింది. కాగా ఓవల్‌ స్టేడియం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉంది. 1845లో దీనిని ప్రారంభించారు.

అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్‌ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్‌ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్‌లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్‌ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది.

చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్‌ పెట్టండి'
Rishabh Pant: 'స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే హాయిగా ఉంది'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)