Breaking News

వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు.. ఫైనల్‌ మ్యాచ్‌ ఎక్కడంటే?

Published on Fri, 07/31/2026 - 09:20

వన్డే ప్రపంచకప్‌-2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికలను ఐసీసీ ఖారారు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ జైషా మాట్లాడుతూ.. "వన్డే వరల్డ్‌కప్‌-2027కు సంబంధించి మరో కీలక అడుగు పడింది.  24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నమెంట్ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు తమ ఆత్మీయత, క్రీడాభిమానంతో క్రికెట్ ప్రేమికులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయని ఆశిస్తున్నాం" అని అ‍న్నారు.

కాగా ఈ టోర్నీలో మెజారిటీ భాగం మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. ఆధునిక స్టేడియాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అక్కడే 8 నగరాలను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వేలో 3 వేదికలు, నమీబియా రాజధాని విండ్‌హాక్‌లో ఒక వేదికలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జోహన్నెస్‌బర్గ్‌లోని చారిత్రాత్మక 'వాండరర్స్ స్టేడియం' లో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ పోరు జరగనుంది.

ఈసారి 50 ఓవర్ల వరల్డ్‌కప్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 57 మ్యాచ్‌లు జరుగుతాయి. పోటీతత్వాన్ని పెంచేందుకు మూడు దశల విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టనుంది. 

12 నుంచి 14వ ర్యాంకులో ఉన్న జట్ల మధ్య జరిగే 'సూపర్ సిరీస్‌'తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ నిర్వహిస్తారు. అనంతరం 'సూపర్ 7' రౌండ్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.  ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.

వేదికల వివరాలు
దక్షిణాఫ్రికా: వాండరర్స్ (జొహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (ష్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (కుగోంపో సిటీ).

జింబాబ్వే: హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), ఫాలే మోసీ-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్). 
నమీబియా: నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్‌హోక్).
చదవం‍డి: PAK vs WI: పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. ఇక అంతే సంగతి?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)