Breaking News

IPL 2023: నేనొక ఇడియట్‌.. సెంచరీ తర్వాత అలా మాట్లాడినందుకు: బ్రూక్‌

Published on Wed, 12/06/2023 - 15:20

IPL 2023- SRH- Harry Brook: భారత క్రికెట్‌ అభిమానుల గురించి తాను అలా మాట్లాడకపోవాల్సిందంటూ ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌-2023లో సెంచరీ చేసిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా సోషల్‌ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్న తర్వాతే తన మానసిక స్థితి మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2022 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ 13.25 కోట్ల రూపాయాల భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, 24 ఏళ్ల ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

నోళ్లు మూయించానంటూ ఘాటు వ్యాఖ్యలు
వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో శతకం బాదిన తర్వాత.. తనను ట్రోల్‌ చేసిన వాళ్ల నోళ్లు మూయించాను అంటూ బ్రూక్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

పశ్చాత్తాపంతో
ఈ విషయం గురించి తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న హ్యారీ బ్రూక్‌.. ‘‘అప్పుడు నేను ఓ ఇడియట్‌లా ప్రవర్తించాను. ఇంటర్వ్యూలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాపపడ్డాను.

హోటల్‌ గదిలో కూర్చుని సోషల్‌ మీడియా అకౌంట్లు ఓపెన్‌ చేయగానే.. చూడకూడని కామెంట్లు ఎన్నో చూశాను. అప్పటి నుంచి నెట్టింటికి కొంతకాలం పాటు దూరం కావాలని నిర్ణయించుకున్నాను. 

భారీ మొత్తానికి న్యాయం చేయలేక
నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా.. కేవలం ఆట మీదే దృష్టిసారించాను. తద్వారా నా మానసిక ఆరోగ్యం మరింత మెరుగైంది’’ అని తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2023 కోసం సన్‌రైజర్స్‌ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి హ్యారీ బ్రూక్‌ న్యాయం చేయలేకపోయాడు.

ఆడిన 11 ఇన్నింగ్స్‌లో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‌-2024 వేలానికి ముందు బ్రూక్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. విండీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విండీస్‌ చేతిలో ఓటమిపాలైంది.

చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌.. సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)