‘ఫొటోలు, వీడియోలు తీశాడు.. బతిమిలాడాడు’

Published on Wed, 07/01/2026 - 13:25

తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబ్‌ కింగ్స్‌ క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌ స్పందించాడు. వంటమనిషిగా చెప్పుకొంటున్న వ్యక్తి చెప్పినట్లుగా అతడిపై తాము దాడిచేయలేదని స్పష్టం చేశాడు. నిజానికి వంట పేరుతో ఇంట్లో చేరి అతడే తమను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించాడు.

దాడికి పాల్పడ్డారు!
కాగా శశాంక్‌ సింగ్‌, అతడి తండ్రి, విశ్రాంత స్పెషల్‌ డీజీపీ శైలేశ్‌ సింగ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారి ఇంట్లో వంట మనిషిగా చేరిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భోపాల్‌లో ఎఫ్‌ఐర్‌ నమోదైంది. తనను పదే పదే దూషిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. బంధించి కొట్టారని అతడు ఆరోపించాడు. పని మానేయాలని అనుకున్నానని.. అంతలోనే ఇలా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు.

ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు
ఈ విషయం గురించి శశాంక్‌ సింగ్‌ తాజాగా ANIతో మాట్లాడాడు. ‘‘మేము అతడిని బంధించలేదు. నిజానికి అతడు వంట చేస్తానంటూ మా ఇంట్లో అడుగుపెట్టాడు. కానీ అతడికి వంట చేయడం రానేరాదు.

మా ఇల్లంతా తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు. నా గదిలోకి కూడా వచ్చి అక్కడ రికార్డింగ్‌ చేశాడు. అతడి వ్యవహారశైలిపై మాకు అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని అనిపించింది. అయితే, మా ఇంట్లో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాం.

డిలీట్‌ చేయమని హెచ్చరించింది
ఇప్పటి వరకు ఈ విషయం గురించి పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. అతడు మా ఇంట్లో ఫొటోలు, వీడియోలు తీయడం చూసి మా అమ్మ వాటిని డిలీట్‌ చేయమని అతడిని హెచ్చరించింది. నా సోదరి 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తానని అతడితో అన్నది. అయితే, అతడు మాత్రం ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ బతిమిలాడుకున్నాడు.

కానీ తిరిగి మా మీదే ఆరోపణలు చేశాడు. నేను ఎవరినీ అసభ్యంగా కూడా దూషించను. అలాంటిది ఏకంగా దాడి చేశానని అంటే నా గురించి తెలిసిన వారు ఎవరూ నమ్మరు. అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు’’ అని శశాంక్‌ సింగ్‌ కొట్టిపారేశాడు.

అదే నిజమైతే కఠిన చర్యలు
అయితే, వంట మనిషి ఫిర్యాదు ఆధారంగా తాము ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు జోన్‌ 1 అదనపు డీసీపీ రష్మీ అగర్వాల్‌ దూబే జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘‘శైలేశ్‌ సింగ్‌, అతడి కుమారుడు, క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌, వారి డ్రైవర్‌పై కేసు నమోదు చేశాము.

ఫిర్యాదుదారును వైద్య పరీక్షల నిమిత్తం పంపించాము. ఒకవేళ అతడికి గాయాలయ్యాయని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అయితే, అతడిని చూసినపుడు.. అతడు ఆరోపించినట్లు తీవ్రమైన గాయాలు అయినట్లు మాకు కనిపించలేదు. అందుకే పరీక్షలకు పంపించాము’’ అని ఆమె పేర్కొన్నారు.

చదవండి: హార్దిక్‌  పాండ్యా సంచలన నిర్ణయం! 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)