Breaking News

న్యూజిలాండ్‌ తరఫున రీ ఎంట్రీ.. ట్రెంట్‌ బౌల్ట్‌ కీలక వ్యాఖ్యలు.. ఇకపై..

Published on Thu, 08/10/2023 - 12:36

I’m a dad first: జాతీయ జట్టులో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ హర్షం వ్యక్తం చేశాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలగాలన్న కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని.. కెరీర్‌ను పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వెల్లడించాడు. జాతీయ జట్టుకు ఆడటం ఎల్లప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.

కాగా గతేడాది బ్లాక్‌ క్యాప్స్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకుంటూ బౌల్ట్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో ఆడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత తిరిగి న్యూజిలాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు బౌల్ట్‌. ఇంగ్లండ్‌లో పర్యటించే కివీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.

మళ్లీ వెనక్కి ఎందుకు?
ఈ నేపథ్యంలో బౌల్ట్‌ అభిమానులు సంతోషిస్తుండగా.. కొంతమంది మాత్రం న్యూజిలాండ్‌ బోర్డు వైఖరిని తప్పుబడుతున్నారు. ఎంతో మంది యువ ప్లేయర్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తుంటే.. దేశాన్ని లెక్కచేయని వాళ్లను మళ్లీ వెనక్కి పిలవడం ఏమిటని మండిపడుతున్నారు.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ట్రెంట్‌ బౌల్ట్‌.. ‘‘న్యూజిలాండ్‌ క్రికెట్‌ బబుల్‌ నుంచి దూరమవ్వాలన్న నిర్ణయం తీసుకునేందుకు ఎంతో మదనపడ్డాను. కానీ నాకోసం, నా కుటుంబం కోసం అలా చేయకతప్పలేదు. న్యూజిలాండ్‌ కోసమైనా, ఫ్రాంఛైజీలకు ఆడినా అదంతా నా కెరీర్‌ను పొడిగించుకోవడం కోసమే!

ముందు డాడీని.. తర్వాతే..
బౌలర్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని కోరుకుంటున్నా. దేశం కోసం ఆడటం గొప్ప అనుభూతినిస్తుంది. రానున్న రెండు నెలలు సంతోషంగా గడవనున్నాయి’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక మళ్లీ టీ20 ఫ్రీలాన్స్‌ క్రికెటర్‌గా సేవలు అందిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా..‘‘ఇప్పటికైతే తెలియదు. ఎందుకంటే నేను ముందుగా డాడీని.. ఆ తర్వాతే ఆల్‌రౌండర్‌ను’’ అని ప్రాధాన్యాలను వివరించాడు. కాగా 34 ఏళ్ల ట్రెంట్‌ బౌల్ట్‌కు భార్య గెర్ట్‌, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

చదవండి: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)