Breaking News

'వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్‌కు సెట్ కాడు'

Published on Sat, 09/19/2026 - 19:09

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో రాణించడానికి ఇబ్బంది పడతాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

అండర్-19 తో పాటు ఐపీఎల్‌లోనూ సంచలన ప్రదర్శన చేసి భారత సీనియర్ జట్టులో​కి అడుగు పెట్టిన వైభవ్‌.. తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం ఈ చిచ్చర పిడుగుకు చోటు దక్కలేదు. కాగా సూర్యవంశీ కేవలం వైట్‌బాల్ క్రికెట్‌లోనే కాదు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణిస్తున్నాడు. 

ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్‌లోనూ ఈస్ట్‌జోన్ తరపున సూర్యవంశీ సత్తాచాటాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్‌-19తో జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి వైభవ్ టెస్టు క్రికెట్‌లో విజయవంతం కాలేడని పనేసర్ వ్యాఖ్యనిచండం గమనార్హం.

"వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌లో సక్సెస్ అవుతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆ స్ధాయికి తగ్గ స్కిల్స్ లేవు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టులు, టీ20లు రెండింటిలోనూ టాప్-10లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రమే" అని పనేస‌ర్ పేర్కొన్నాడు.
చదవండి: భారత జ‌ట్టులో అత‌డి పేరు చూసి షాక‌య్యా!

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)