Breaking News

ఐసీసీ ప్రీమియర్ పార్ట్‌నర్‌గా హ్యుందాయ్

Published on Tue, 12/23/2025 - 18:54

హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్‌ టోర్నమెంట్‌లకు ప్రీమియర్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.

ఈ ఒప్పందంతో హ్యుందాయ్‌కు లభించే ప్రత్యేక హక్కులు..
- మ్యాచ్‌డే కాయిన్ టాస్‌లో భాగస్వామ్యం  
- స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్  
- అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement)  

ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు.  

హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్‌ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు.   

ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్‌ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్‌లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు.  

కాగా, హ్యుందాయ్ మోటర్‌ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)