Breaking News

'మెరుపు తీగ' మంధన.. కళ్లు చెదిరే రనౌట్‌

Published on Sun, 08/11/2024 - 14:56

మహిళల హండ్రెడ్‌ లీగ్‌లో సథరన్‌ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన కళ్లు చెదిరే రీతిలో ఓ అద్భుతమైన రనౌట్‌ చేసింది. ట్రెంట్‌ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 10) జరిగిన మ్యాచ్‌లో మంధన.. బ్రైవోని స్మిత్‌ను డైరెక్ట్‌ త్రోతో పెవిలియన్‌ బాట పట్టించింది. మంధన మెరుపు విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవలవుతంది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే మంధన స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రెంట్‌ రాకెట్స్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (60 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాకెట్స్‌ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ స్క్రీవెన్స్‌ (36) ఓ మోస్తరు పరుగులు చేయగా.. నటాషా (12), గార్డ్‌నర్‌ (18), హీథర్‌ గ్రహం (15) రెండంకెల స్కోర్లు చేశారు. సథరన్‌ బ్రేవ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ 3, లారెన్‌ చియాటిల్‌, ఆడమ్స్‌, క్లో టైరాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

156 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్‌.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధన (27 బంతుల్లో 42; 7 ఫోర్లు), క్లో టైరాన్‌ (31 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్‌ జార్జియా ఆడమ్స్‌ 29 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాకెట్స్‌ బౌలర్లలో స్టోన్‌హౌస్‌ 2, ఆష్లే గార్డ్‌నర్‌, హీథర్‌ గ్రహం తలో వికెట్‌ పడగొట్టారు.

 

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)