Breaking News

ఇంగ్లండ్‌ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్‌ వర్మ

Published on Tue, 06/24/2025 - 16:23

తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌ తిలక్‌ వర్మ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్‌.. ఇంగ్లండ్‌ గడ్డపై తన తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. 

ఎసెక్స్‌తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్‌.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్‌ బౌలింగ్‌లో డీన్‌ ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎసెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ కాగా.. హ్యాంప్‌షైర్‌ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్‌). తిలక్‌ ఔట్‌ కాగానే మరో హ్యాంప్‌షైర్‌ ఆటగాడు లియామ్‌ డాసన్‌ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో చార్లీ అల్లీసన్‌ (101) సెంచరీతో కదంతొక్కాడు.

కాగా, తిలక్‌ ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్‌ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. వైట్‌బాల్‌ గేమ్స్‌ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జ‌రుగుతోంది.

22 ఏళ్ల తిలక్‌ ఈ మ్యాచ్‌కు ముందు వరకు 18 ఫ‌స్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు  సెంచరీలు, నాలుగు ఆర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్‌.. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అతను 24 ఇన్నింగ్స్‌లలో 49.93 స‌గ‌టుతో 749 పరుగులు చేశాడు.

తిలక్‌కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్‌లు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ నాటింగ్హమ్‌షైర్‌తో.. రుతురాజ్‌ గైక్వాడ్‌ యార్క్‌షైర్‌తో జతకట్టారు. ఇషాన్‌ కూడా తిలక్‌ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో  98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)