Breaking News

సామ్‌ కర్రన్‌ ఆల్‌రౌండ్‌ షో

Published on Fri, 08/09/2024 - 16:57

హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ ఆటగాడు సామ్‌ కర్రన్‌ అద్భుత ఫామ్‌ కొనసాగుతుంది. ఈ టోర్నీలో బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోతున్న సామ్‌.. తాజాగా మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్‌.. తొలుత బంతితో (20-7-28-2), ఆతర్వాత బ్యాట్‌తో (18 బంతుల్లో 35; 5 సిక్సర్లు) చెలరేగి తన జట్టును గెలిపించాడు. 

ఈ మ్యాచ్‌లో సామ్‌ సోదరుడు టామ్‌ కూడా రాణించాడు. టామ్‌ నాలుగు వికెట్లు తీసి సథరన్‌ బ్రేవ్‌ పతనాన్ని శాశించాడు. సామ్‌, టామ్‌ బంతిలో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రేవ్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ విన్స్‌ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే రాణించాడు. 

అలెక్స్‌ డేవిస్‌ (5), ఆండ్రీ ఫ్లెచర్‌ (1), లూస్‌ డి ప్లూయ్‌ (4), లారీ ఈవాన్స్‌ (4), కీరన్‌ పోలార్డ్‌ (18), జోఫ్రా ఆర్చర్‌ (10), అకీల్‌ హొసేన్‌ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇన్విన్సిబుల్స్‌ బౌలర్లలో సామ్‌, టామ్‌తో పాటు విల్‌ జాక్స్‌, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ తీశారు.

119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌.. సామ్‌ కర్రన్‌, జోర్డన్‌ కాక్స్‌ (29 బంతుల్లో 46 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్విన్సిబుల్స్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ జాక్స్‌ 6, డేవిడ్‌ మలాన్‌ 14, సామ్‌ బిల్లింగ్స్‌ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రేవ్‌ బౌలర్లలో క్రెయిగ్‌ ఓవర్టన్‌, టైమాల్‌ మిల్స్‌, క్రిస్‌ జోర్డన్‌, అకీల్‌ హొసేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)