Breaking News

ఐదు వికెట్లతో చెలరేగిన రషీద్‌ ఖాన్‌

Published on Mon, 08/03/2026 - 10:58

‘ది హండ్రెడ్‌ మెన్స్‌ కాంపిటిషన్‌’- 2026లో అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎంఐ లండన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన జట్టును గెలిపించాడు.

విల్‌ జాక్స్‌, పూరన్‌ మెరుపులు
లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ మైదానంలో టాస్‌ గెలిచిన మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ లండన్‌ వంద బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లలో విల్‌ జాక్స్‌ మెరుపు అర్ధ శతకం (31 బంతుల్లో 62) సాధించగా.. వన్‌డౌన్‌ వచ్చిన నికోలస్‌ పూరన్‌ కూడా హాఫ్‌సెంచరీ (28 బంతుల్లో 54)తో మెరిశాడు.

చెలరేగిన రషీద్‌ ఖాన్‌
మిగిలిన వారిలో కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ ధనాధన్‌ (11 బంతుల్లో 23) దంచికొట్టగా.. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ నాలుగు బంతుల్లో ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌.. లండన్‌ బౌలర్ల ధాటికి తాళలేక 95 బంతుల్లో 138 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది.

టాపార్డర్‌లో కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (26 బంతుల్లో 50) అర్ధ శతకం చేయగా.. మిగిలిన వారిలో లూయిస్‌ డూ ప్లోయీ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. లండన్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో మాంచెస్టర్‌ లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆరో నంబర్‌ బ్యాటర్‌ నుంచి అందరూ సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు.

20 బంతుల్లో కేవలం 17 పరుగులే
లండన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 20 బంతుల్లో కేవలం 17 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చి.. మాంచెస్టర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మిగితా వారిలో టామ్‌ కర్రాన్‌ రెండు, ట్రెంట్‌ బౌల్ట్‌, రిచర్ట్‌ గ్లీసన్‌, నాథన్‌ సోటర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఇక మాంచెస్టర్‌ 138 పరుగులకే కుప్పకూలగా లండన్‌ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. రషీద్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా 2024 తర్వాత ది హండ్రెడ్‌ కాంపిటిషన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో లండన్‌కు ఐదింట ఇది మూడో విజయం కాగా.. మాంచెస్టర్‌కు ఐదింట మూడో ఓటమి.

చదవండి: బుమ్రా అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Videos

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)