Breaking News

పాక్ స్టార్‌ బ్యాటర్లు బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లకు ఘోర అవమానం.!

Published on Wed, 04/06/2022 - 17:42

లండన్: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లకు ఘోర అవమానం జరిగింది. ఈ నెల 5న జరిగిన లీగ్‌ మెగా వేలంలో రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంగా పోటీపడిన ఈ ఇద్దరు బ్యాటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ పాక్‌ ద్వయం అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ తాజాగా జరిగిన ఆసీస్‌ సిరీస్‌లో సెంచరీల మోత మోగించి పరుగుల వరద పారించినప్పటికీ అతనిపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా కొనసాగుతున్న పాక్‌ కెప్టెన్‌ను వంద బంతుల ఫార్మాట్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడాన్ని పాక్‌ మాజీలు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్‌ ఆజమ్‌ను టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో పోల్చుకునే పాక్‌ అభిమానులకు ఇది చెంపపెట్టు లాంటింది. ఐపీఎల్ వేలంలోకి తమ కెప్టెన్ పాల్గొంటే కనీసం రూ.20 కోట్లు దక్కేవి అని బడాయికి పోయిన ఆ దేశ మాజీలు ఈ పరిణామంలో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాక ముఖం చాటేస్తున్నారు. బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లతో పాటు హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా చుక్కెదురైంది. 

వార్నర్‌ను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. అయితే వంద బంతుల లీగ్‌లో ఐపీఎల్‌ ఆటగాళ్లను మాత్రం భలే డిమాండ్‌ ఉండింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయారు. కీరన్ పొల్లార్డ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్క్‌ వుడ్, జోస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, మార్కస్ స్టొయినిస్, రషీద్ ఖాన్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టొన్, ఆడమ్ మిల్నే లాంటి ఐపీఎల్‌ స్టార్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. కాగా, వంద బంతుల ఫార్మాట్‌లో సాగే హండ్రెడ్‌ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: హండ్రెడ్‌ లీగ్‌లో ఐపీఎల్‌ స్టార్లు, ఇక్కడేమో కోట్లు కుమ్మరించారు.. అక్కడేమో..!

Videos

ఇద్దరి ప్రాణాలు తీసిన ఇన్ స్టా పరిచయం

ఆ నలుగురితో నాకు సంబంధం లేదు..!

మూడు రోజులు భారీ వర్షాలు..

కేరళ లో 273.. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర

అడ్డంగా దొరికిపోయిన విజయసాయి రెడ్డి.. వీడియో వైరల్

ఆగని కక్ష సాధింపులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

Photos

+5

ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

'భైరవం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)