Breaking News

జేమీ స్మిత్‌ విధ్వంసం.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన కేన్‌ మామ

Published on Fri, 08/15/2025 - 08:17

హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌ రెండో విజయం సాధించింది. నిన్న (ఆగస్ట్‌ 14) ట్రెంట్‌ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కేన్‌ మామ ఈ మ్యాచ్‌లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు, సిక్స్‌) ఆడాడు. 

ఓపెనర్‌గా వచ్చిన జేమీ స్మిత్‌ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్‌ సెంచరీ బాదాడు. కేన్‌, స్మిత్‌లకు టర్నర్‌ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు), ఓలీ పోప్‌ (9 బంతుల్లో 17 నాటౌట్‌; 3 ఫోర్లు) తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన లండన్‌ స్పిరిట్‌ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

గత రెండు మ్యాచ్‌ల్లో మెరుపు హాఫ్‌ సెంచరీలు చేసిన డేవిడ్‌ వార్నర్‌ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాకెట్స్‌ బౌలర్లలో స్టోయినిస్‌ 2, కుక్‌, ఫెర్గూసన్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాకెట్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమీ ఓవర్టన్‌ పొదుపుగా (20-10-15-1) బౌలింగ్‌ చేసి రాకెట్స్‌ను కట్టడి చేశాడు. వార్రల్‌, గ్లీసన్‌ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

రాకెట్స్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (46), స్టోయినిస్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జో రూట్‌ (27), డేవిడ్‌ విల్లే (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)