Breaking News

కశ్మీర్‌ విల్లో బ్యాట్లకు ఫుల్‌ డిమాండ్‌.. వన్డే ప్రపంచకప్‌కు తొలిసారి

Published on Wed, 06/21/2023 - 13:40

అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌లో వన్డే వరల్డ్‌కప్‌ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్‌ సేన కప్‌ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది.

వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్‌లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్‌ విల్లో బ్యాట్లను వాడుతున్నారు.

వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్‌(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి.  వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి.

దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్‌.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది.

ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు.

బ్యాట్ల తయారీతో కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్‌టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా

13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)