Breaking News

'ఒకప్పుడు వరల్డ్‌ నంబర్‌ వన్‌.. ఇప్పుడు జట్టులో నో ఛాన్స్‌'

Published on Fri, 12/05/2025 - 15:16

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.

సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్‌నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. 

సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు.

"మహ్మద్ సిరాజ్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు?  సెల‌క్ట‌ర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావ‌డం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. అత‌డు ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్‌.. వ‌న్డేల్లో ఆడ‌లేడా? ఇంత‌కుముందు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి కూడా అత‌డిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 

ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగాడు. అటువంటి బౌల‌ర్ ఇప్పుడు జ‌ట్టులోనే లేకుండా పోయాడు. హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు. 

అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కలేదు.
చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)