Breaking News

అవకాశాల్లేవు.. వరల్డ్‌కప్‌ జట్టులో మాత్రం అతడికి చోటివ్వండి!

Published on Fri, 04/19/2024 - 18:51

ఐపీఎల్‌-2023.. ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించిన ఘనత.. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి 474 పరుగులతో సత్తా చాటి ‘నయా ఫినిషర్‌’గా బిరుదు.. అదే ఏడాది ఆగష్టులో టీమిండియా తరఫున అరంగేట్రం..

ఇప్పటికే ఆటగాడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును.. రింకూ సింగ్‌. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున గతేడాది దంచికొట్టిన ఈ యూపీ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. అదే జోష్‌లో టీమిండియా తలుపుతట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇప్పటి వరకు భారత్‌ తరఫున 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఆయా ఫార్మాట్లలో వరుసగా 356, 55 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించాడు. అయితే.. ఐపీఎల్‌-2024లో మాత్రం అతడికి ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రావడం లేదు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి రింకూ 83 పరుగులు చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అయితే.. అతడి స్ట్రైక్‌రేటు(162.75) మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘అతడికి ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రావడం లేదు కాబట్టి.. సెలక్టర్లు రింకూ సింగ్‌ పేరును మర్చిపోరనే అనుకుంటున్నా. ఈ టోర్నీ తర్వాత అతడు నేరుగా టీమిండియాలో అడుగుపెట్టగల సత్తా కలిగిన వాడు.

నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకోవడం చూస్తున్నాం. టీమిండియా కీలక సభ్యుల్లో అతడూ ఒకడు. కొంతమంది స్టార్ల కంటే కూడా అద్భుతంగా ఆడగలిగినవాడు’’ అంటూ సంజయ్‌ మంజ్రేకర్‌.. టీ20 ప్రపంచకప్‌-2024 ఆడే భారత జట్టులో రింకూ సింగ్‌కు తప్పక చోటు కల్పించాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. 

కాగా మే 26న ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ముగియనుండగా.. జూన్‌ 1 నుంచి వరల్డ్‌కప్‌ సమరం మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్‌లో సాగే ఈవెంట్‌కు వెస్టిండీస్‌- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్‌ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో తమ ప్రయాణం ఆరంభించనుంది.

చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్‌.. రోహిత్‌ మాట విని అలా! వైరల్‌ వీడియో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)