Breaking News

పాకిస్తాన్ సంచ‌ల‌నం.. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో

Published on Sun, 11/09/2025 - 12:51

హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నీలో పాకిస్తాన్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. ఆదివారం మోంగ్‌కాంగ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్లో పాక్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు తేడాతో ఆసీస్‌ను ఓడించిన పాక్‌.. కువైట్‌తో తుదిపోరుకు సిద్ద‌మైంది.

ఈ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 6 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.   పాక్‌ బ్యాటర్లలో ఖవాజా నఫే(14 బంతుల్లో 1 ఫోర్‌, 7 సిక్స్‌లతో 50) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటగా.. అబ్దుల్‌ సమద్‌(34), అబ్బాస్‌ అఫ్రిది(19) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో రాస్‌ రెండు వికెట్లు సాధించాడు.

అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కంగారుల విజయానికి చివరి ఓవర్‌లో 30 పరుగులు అవసరమవ్వగా.. క్రిస్‌ గ్రీన్‌ మెరుపులు మెరిపించాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని గ్రీన్‌ బౌండరీగా మలిచాడు. 

అయితే తొలి బంతి నోబాల్‌ కావడంతో అతడికి ఫ్రీహిట్‌ లభించింది. కానీ గ్రీన్‌ ఫ్రీహిట్‌ బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆ తర్వాత గ్రీన్‌ వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. ఆఖరి రెండు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఐదో బంతికి గ్రీన్‌ రనౌటయ్యాడు. చివరి బంతికి ఆండ్రూ టై ఫోర్‌ కొట్టినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఒకవేళ అతడు సిక్స్‌ బాది ఉంటే ఆసీస్‌ ఫైనల్‌కు అర్హత సాధించేది.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. గంభీర్‌ మాస్టర్‌ మైండ్‌! 39 ఏళ్ల త‌ర్వాత‌?


 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)