Breaking News

Hockey Asia Cup: ఫైనల్లో భారత్‌

Published on Sat, 09/06/2025 - 23:29

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా కప్‌ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్‌–4’ దశ చివరి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందంజ వేసే స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ‘సూపర్‌–4’ ఆఖరి పోరులో శనివారం భారత్‌ 7–0 గోల్స్‌ తేడాతో చైనాను చిత్తుచేసింది. 

భారత్‌ తరఫున అభిషేక్‌ (46వ, 50వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో సత్తా చాటగా... శిలానంద్‌ లక్డా (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (7వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (18వ నిమిషంలో), రాజ్‌ కుమార్‌ పాల్‌ (37వ నిమిషంలో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (39వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. 

‘సూపర్‌–4’ దశ ముగిసేసరికి భారత్‌ 7 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ కొరియా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం టైటిల్‌ సమరం జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. మూడో స్థానం కోసం మలేసియాతో చైనా తలపడుతుంది. 

చైనాతో పోరులో టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. భారత స్ట్రయికర్ల ధాటికి చైనా ప్లేయర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థికి ఒక్క పెనాల్టీ కార్నర్‌ అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్‌ ఆరంభమైన నాలుగో నిమిషంలో శిలానంద్‌ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌... ఇక చివరి వరకు అదే జోరు కొనసాగించింది. మరో మ్యాచ్‌లో కొరియా 4–3 గోల్స్‌ తేడాతో మలేసియాపై గెలిచింది.  

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)