Breaking News

చిన్న జ‌ట్టు సంచ‌ల‌నం.. ఈక్వెడార్‌కు భారీ షాక్‌

Published on Sun, 06/21/2026 - 07:57

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈక్వెడార్ ప్ర‌యాణం ముగిసింది. నాకౌట్ ద‌శ‌కు చేర‌కుండానే ఇంటిబాట ప‌ట్టనుంది. టోర్నీలో భాగంగా ఆదివారం గ్రూప్-ఈలో కురాకావోతో జ‌రిగిన మ్యాచ్‌ను ఈక్వెడార్ (0-0)తో డ్రా చేసుకుంది. నిర్ణీత స‌మ‌యంలో ఇరుజ‌ట్లు గోల్ కొట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో మ్యాచ్ డ్రా కావ‌డంతో ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించాయి. 

అయితే తొలిసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న కురాకావో జ‌ట్టు ఒక పాయింట్ సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది. మ్యాచ్ డ్రా చేసుకున్న‌ప్ప‌టికీ త‌న‌కంటే ఎన్నో రెట్లు మెరుగైన ఈక్వెడార్‌ను నిలువ‌రించ‌డం వారికి విజ‌యంతో స‌మానం. మ్యాచ్‌లో ఈక్వెడార్ 15 సార్లు కురాకావో గోల్ పోస్టుపై దాడులు చేసింది. 

కురాకావో ఫుట్‌బాల్‌ జట్టు

కానీ కురాకావో గోల్ కీప‌ర్ 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ వాటిని స‌మ‌ర్థంగా అడ్డుకొని మ్యాచ్ డ్రా కావ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అంతేకాదు ఎలోయ్ త‌న విన్యాసాల‌తో  ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో కురాకావోకు ఒక పాయింట్ ల‌భించేలా చేశాడు. ఫిఫా ప్ర‌స్తుత ర్యాంకింగ్స్ ప్ర‌కారం చూసుకుంటే ఈక్వెడార్ 29వ ర్యాంక్‌లో ఉంటే, కురాకావో మాత్రం 83వ ర్యాంకులో కొన‌సాగుతోంది. కేవ‌లం ల‌క్షా 56వేల జ‌నాభా క‌లిగిన కురాకావో ఆడుతున్న తొలి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లోనే త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి చేత శెభాష్ అనిపించుకుంది. 

ఒక ఓటమి, ఒక డ్రాతో ఆఖరిస్థానంలో ఉన్న కురాకావో అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. టోర్నీలో తమ చివరి మ్యాచ్‌ను జూన్ 26న ఐవరీకోస్ట్‌తో ఆడనుంది. మరోవైపు ఈక్వెడార్ కూడా టోర్నీ నుంచి వైదొలిగినట్లే. తమ చివరి మ్యాచ్‌ను గ్రూప్‌-ఈలో టాపర్‌గా ఉన్న జర్మనీతో జూన్ 26న ఆడనుంది.

 

చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)