తిరుగులేని ఆస్ట్రేలియా.. సరికొత్త చరిత్ర

Published on Mon, 07/06/2026 - 13:13

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. రికార్డు స్థాయిలో ఏకంగా ఏడోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. జగజ్జేతగా అవతరించింది.

టైటిల్‌ పోరులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ ఓపెనర్లు ఆమీ జోన్స్‌ (6), డానీ వ్యాట్‌ హాడ్జ్‌ (8) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ అర్ధ శతకం (53 బంతుల్లో 58 నాటౌట్‌) బాది ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది.

ఆమెకు తోడుగా అలిస్‌ కాప్సే (23) రాణించగా.. ఫ్రేయా కెంప్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (28 బంతుల్లో 44 నాటౌట్‌) ఆడింది. ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

తద్వారా ఆతిథ్య జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్‌ మూనీ (49 బంతుల్లో 64), ఫోబే లిచిఫీల్డ్‌ (35 బంతుల్లో 48) దంచికొట్టారు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేమిటో చూసేద్దామా?!

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన
👉ఆస్ట్రేలియా- 2026లో ఇంగ్లండ్‌పై లార్డ్స్‌ వేదికగా 153/3
👉వెస్టిండీస్‌- 2016లో ఆస్ట్రేలియాపై కోల్‌కతా వేదికగా 149/2
👉ఆస్ట్రేలియా- 2014లో ఇంగ్లండ్‌పై మీర్పూర్‌ వేదికగా 106/4

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
👉బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్‌ మీద 78 నాటౌట్‌
👉అలిసా హేలీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్‌ మీద 75
👉బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 2023లో సౌతాఫ్రికా మీద 74 నాటౌట్‌
👉హేలీ మాథ్యూస్‌ (వెస్టిండీస్‌)- 2016లో ఆస్ట్రేలియా మీద 66 
👉బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 2026లో ఇంగ్లండ్‌ మీద 64

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం
👉హేలీ మాథ్యూస్‌- స్టెఫానీ టేలర్‌ (వెస్టిండీస్‌)- 2016లో ఆస్ట్రేలియా మీద తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం
👉అలిసా హేలీ- బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్‌ మీద తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం
👉బెత్‌ మూనీ- ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)-2026లో ఇంగ్లండ్‌ మీద రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం
👉ఫ్రేయా కెంప్‌- నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌)- 2026లో ఆస్ట్రేలియా మీద ఐదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం

మహిళల టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో అత్యధికసార్లు 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన క్రికెటర్లు
👉బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 5
👉నాట్‌ సివర్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌)- 3
👉మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా), లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)- 2.

మహిళల క్రికెట్‌లో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించిన జట్లు (వరల్డ్‌కప్‌+ టీ20 ప్రపంచకప్‌)
👉ఆస్ట్రేలియా- పద్నాలుగు సార్లు
👉ఇంగ్లండ్‌- ఐదు సార్లు
👉న్యూజిలాండ్‌- రెండు సార్లు
👉వెస్టిండీస్‌- ఒకసారి
👉భారత్‌- ఒకసారి.

చదవండి: వైభవ్‌ అరంగేట్రంపై విమర్శలు.. బీసీసీఐ స్పందన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)