Breaking News

మరో బిగ్‌ సండే.. వచ్చే ఆదివారం మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా‌..!

Published on Tue, 08/30/2022 - 18:49

IND VS PAK: ఆసియా కప్‌ 2022లో గత ఆదివారమే (ఆగస్ట్‌ 28) పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా.. వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 4) మరోసారి చిరకాల ప్రత్యర్ధిని ఢీకొట్టే అవకాశం ఉం‍ది. అదెలా అంటే.. షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌-ఏలో ఉన్న భారత్‌, పాక్‌, హాంగ్‌కాంగ్‌ జట్లు ప్రత్యర్ధి జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. 

గ్రూప్‌-ఏలో టీమిండియా ఇప్పటికే పాక్‌ను మట్టికరిపించి, టేబుల్‌ టాపర్‌ (ఏ-1) బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్‌ తదుపరి మ్యాచ్‌ల్లో ఆగస్ట్‌ 31న టీమిండియా, హాంకాంగ్‌ జట్లు.. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్తాన్, హాంకాంగ్‌ జట్లు తలపడనున్నాయి. పై రెండు మ్యాచ్‌ల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. పసికూన హాంగ్‌కాంగ్‌ గెలిచే అవకాశం లేదు. 

ఈ లెక్కన గ్రూప్‌-ఏలో తొలి స్థానంలో భారత్‌.. రెండో స్థానంలో పాకిస్తాన్‌ జట్లు ఉంటాయి. షెడ్యూల్‌ ప్రకారం.. గ్రూప్‌-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. ప్రస్తుత సమీకరణల ప్రకారం చూస్తే.. భారత్‌-పాక్‌ జట్లు సూపర్‌-4 దశలోనే కాకుండా మరోసారి కూడా ఎదురెదురుపడే అవకాశం ఉంది. 

అదెలా అంటే.. సూపర్-4కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్‌లోని (గ్రూప్‌-బి) తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లతో (బి1, బి2) ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 11న (ఆదివారం) ఫైనల్లో తలపడతాయి. ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టి​చూస్తే.. సూపర్‌-4లో భారత్‌, పాక్‌ జట్లకే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అన్నీ ఊహించినట్టు జరిగితే.. భారత్‌, పాక్‌లు సూపర్‌-4లో ఓసారి, ఫైనల్లో మరోసారి తలపడే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే రెండు ఆదివారాలు (సెప్టెంబర్‌ 4, సెప్టెంబర్‌ 11) భారత్‌, పాక్‌ అభిమానులకు క్రికెట్‌ పండుగ కనువిందు చేయడం ఖాయం.
చదవండి: నాలుగేళ్ల క్రితం చెమటలు పట్టించారు.. లైట్‌ తీసుకుంటే అంతే!


 

Videos

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

Photos

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)