Breaking News

బుమ్రాపై ఆసీస్‌ దిగ్గజం మెగ్రాత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 07/29/2026 - 19:21

టీమిండియా పేస్‌ దళ నాయకుడిగా సేవలు అందిస్తున్నాడు జస్‌ప్రీత్‌ బుమ్రా. అయితే, ఫిట్‌నెస్‌ సమస్యలు, గాయాల వల్ల అతడు జట్టుకు తరచూ దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం సైతం బుమ్రా పనిభారాన్ని తగ్గించేక్రమంలో విశ్రాంతినిస్తూ.. అతడిని కాపాడుకుంటూ వస్తోంది.

మోకాలి గాయం
ఇక చాన్నాళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. రెండు మ్యాచ్‌లు ఆడగానే గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా లార్డ్స్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. సిరీస్‌ను ఇంగ్లండ్‌కు 1-2తో కోల్పోయింది.

ఇదిలా ఉంటే.. శ్రీలంకతో ఆగష్టులో జరిగే టెస్టు సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే అతడు జట్టుతో చేరతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ దిగ్గజం గ్లెన్‌ మెగ్రాత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా వయసెంత?
‘‘ప్రస్తుతం బుమ్రా వయసెంత? 31-32 సంవత్సరాల మధ్య ఉంటుంది కదా!.. అతడు ఇప్పటికీ యువకుడే. కాబట్టి తన కెరీర్‌లో ఎలా ఉండాలో అతడే నిర్ణయించుకోవాలి. కెరీర్‌ను పొడిగించుకునే మార్గాల్ని బుమ్రా స్వయంగా అన్వేషించుకోవాలి.

అతడొక అద్భుతమైన నైపుణ్యాలున్న క్లాస్‌ బౌలర్‌. అయితే, దురదృష్టవశాత్తూ తరచూ గాయపడుతున్నాడు. టెస్టు క్రికెట్‌ మీద మాత్రమే దృష్టి పెట్టాలా.. లేదంటే కేవలం టీ20 ఫార్మాట్లోనే ఆడాలా? అన్న విషయంలో అతడు నిర్ణయం తీసుకోవాలి.

కాలమే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది
శరీరం సహకరించే, ప్రతిస్పందించే విధానంపైనే అతడు తనకు నప్పే ఫార్మాట్‌ను ఎంచుకోవాలి. బుమ్రా మాదిరి శైలి ఉన్న ఆటగాళ్లు బౌలింగ్‌ చేసే క్రమంలో తన జాయింట్లపై ఎక్కువగా ఒత్తిడిపెడతారు. శరీరం సహకరిస్తేనే అతడు ముందుకు సాగగలడు. కాబట్టి కాలమే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని మెగ్రాత్‌ అన్నాడు.

విశ్రాంతికి బదులు
అదే విధంగా.. గాయాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా  ఫాస్ట్‌బౌలర్లకే ఉంటుందన్న మెగ్రాత్‌.. వారికి తరచూ విశ్రాంతినివ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదన్నాడు. అందుకు బదులు ఫాస్ట్‌బౌలర్‌గా తమ పాత్ర ఏమిటి? అన్న అంశంపై స్పష్టతనిచ్చి.. ఒత్తిడిని జయించి శారీరంగా మరింత దృఢంగా వారిని తయారు చేయడమే ఇందుకు పరిష్కారం అని పేర్కొన్నాడు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)