Breaking News

శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్‌ ఆయుధం

Published on Tue, 11/18/2025 - 16:24

పాకిస్తాన్‌ వేదికగా ఇవాల్టి నుంచి (నవంబర్‌ 18) ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌కు (Pakistan Tri Series) ముందు శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలుత అనారోగ్యం కారణంగా కెప్టెన్‌ చరిత్‌ అసలంక, ఫాస్ట్‌ బౌలర్‌ అసిత ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు. 

తాజాగా స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ గాయం (హామ్‌స్ట్రింగ్) కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అసలంక స్థానంలో దసున్‌ షనకకు కెప్టెన్‌గా నియమించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు.. హసరంగకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్పిన్‌ ఆయుధాన్ని (విజయకాంత్ వియాస్‌కాంత్‌) జట్టులోకి తీసుకుంది.

23 ఏళ్ల వియాస్‌కాంత్‌ (Vijayakanth Viyaskanth) ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20నే ఆడినప్పటికీ.. ఐపీఎల్‌ సహా దేశవాలీ టోర్నీల్లో తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కుడి చేతి వాటం లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన వియాస్‌కాంత్‌ను స్వదేశంలో భవిష్యత్‌ హసరంగగా కీర్తిస్తుంటారు. పాక్‌ ట్రై సిరీస్‌లో వియాస్‌కాంత్‌ ప్రమాదకర బౌలర్‌గా మారే అవకాశముంది.

కాగా, పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌లో శ్రీలంకతో పాటు జింబాబ్వే పాల్గొంటుంది. ఇవాళ జరిగే టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, జింబాబ్వే తలపడనున్నాయి. శ్రీలంక తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న జింబాబ్వేతో ఆడనుంది.  

పాక్‌ చేతిలో చిత్తు
ట్రై సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య పాక్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తాజాగా ముగిసిన చివరి మ్యాచ​్‌లో పాక్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

పాక్‌ ట్రై సిరీస్‌కు శ్రీలంక క్రికెట్‌ జట్టు (Up dated)..
పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.

చదవండి: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌ రద్దు..!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)