Breaking News

SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్‌.. చిత్తుగా ఓడిన జింబాబ్వే

Published on Fri, 01/19/2024 - 08:04

జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్‌ సెన్సేషన్‌, ఆ జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్‌ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్‌ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కమున్‌హుకామ్వే (12), బ్రియన్‌ బెన్నెట్‌ (29), సీన్‌ విలియమ్స్‌ (15), కెప్టెన్‌ సికందర్‌ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్‌ నిస్సంక (39 నాటౌట్‌), కుశాల్‌ మెండిస్‌ (33) రాణించగా.. ధనంజయ​ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కుశాల్‌ మెండిస్‌ వికెట్‌ సీన్‌ విలియమ్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్‌ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్‌ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. 

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు