England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ

Published on Wed, 06/25/2025 - 20:01

ఇంగ్లండ్‌ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్‌ పేసర్‌గా ఎంపికైన హర్షిత్‌ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్‌ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్‌మెంట్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు హర్షిత్‌ను రిలీజ్‌ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్‌ కోసం బర్మింగ్హమ్‌కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్‌ లేడని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. 

వాస్తవానికి హర్షిత్‌ ఇంగ్లండ్‌ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్‌ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్‌ కోచ్‌ గంభీర్‌ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్‌ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్‌ ప్రారంభానికి ముందు హర్షిత్‌ హుటాహుటిన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. 

అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్‌ పేసర్‌ అవసరం లేదని భారత మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్‌మెంట్‌ హర్షిత్‌ను బీసీసీఐకి సరెండర్‌ చేసినట్లు తెలుస్తుంది.

గంభీర్‌పై విమర్శలు
ఇంగ్లండ్‌ పర్యటన కోసం​ హర్షిత్‌ను టీమిండియా బ్యాకప్‌ పేసర్‌ ఎంపిక​ చేసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. హర్షిత్‌ విషయంలో గంభీర్‌  పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్‌ కేకేఆర్‌ కోచ్‌గా ఉన్నప్పుడు హర్షిత్‌ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యాక హర్షిత్‌ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్‌ వినిపించింది. 

గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యాకే హర్షిత్‌ మూడు ఫార్మాట్లలో భారత్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్‌లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు హర్షిత్‌ను బ్యాకప్‌ పేసర్‌గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్‌ను బీసీసీఐ సరెండర్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, బ్యాకప్‌ పేసర్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్‌ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బౌలింగ్‌ విభాగం కూడా ఒకానొక కారణం. 

తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్‌ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌కు పగ్గాలేయడం​ ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్‌ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)