Breaking News

టీమిండియా స్టార్‌ హర్షిత్‌ రాణాకు షాక్‌.. ‘ఓవరాక్షన్‌’కు తప్పదు మూల్యం!

Published on Tue, 08/12/2025 - 17:47

టీమిండియా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా మరోసారి అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. బౌలింగ్‌లోనే కాదూ.. బ్యాటర్లకు సెండాఫ్‌ ఇవ్వడంలోనూ మరోమారు దూకుడు ప్రదర్శించి మూల్యం చెల్లించాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌-2025 (DPL 2025)లో లోకల్‌ కుర్రాడు హర్షిత్‌ రాణా నార్త్‌ ఢిల్లీ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అర్జున్‌ ధనాధన్‌
ఈ టీ20 ఫార్మాట్‌ లీగ్‌లో భాగంగా నార్త్‌ ఢిల్లీ సోమవారం రాత్రి వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ జట్టుతో తలపడింది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సార్థక్‌ రంజన్‌ (33 బంతుల్లో 42) జట్టు తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. అర్జున్‌ రాప్రియా విలువైన ఇన్నింగ్స్‌ (22 బంతుల్లో 40) ఆడాడు.

హృతిక్‌ షోకేన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ వృథా
ఇక వెస్ట్‌ ఢిల్లీ బౌలర్లలో మయాంక్‌ గసైన్‌ (3/2) అత్యుత్తమంగా రాణించగా.. శుభమ్‌ దూబే కూడా (2/26) కూడా రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్‌ ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో నార్త్‌ ఢిల్లీ జయభేరి మోగించింది. దీంతో హృతిక్‌ షోకేన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (24 బంతుల్లో 51) వృథాగా పోయింది.

నార్త్‌ ఢిల్లీ తరఫున దీపాన్షు గులియా (3/44) అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెస్ట్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో నార్త్‌ ఢిల్లీ కెప్టెన్‌ హర్షిత్‌ రాణా బంతితో రంగంలో దిగాడు. అద్భుత డెలివరీతో ఆయుశ్‌ దోసాంజేను బౌల్డ్‌ చేశాడు.

వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ
ఈ క్రమంలో పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయుశ్‌ను చూస్తూ.. ‘‘వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ సంజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో హర్షిత​ రాణా చర్యను తీవ్రంగా పరిగణించిన డీపీఎల్‌ యాజమాన్యం అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది.

డీపీఎల్‌ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.5 ప్రకారం.. భాష, చర్యలు, ఇతరులను రెచ్చగొట్టే విధంగా సైగలు వంటివి నేరం. ఇందులోని లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడినట్లు హర్షిత్‌ రాణా మ్యాచ్‌ రిఫరీ ముందు అంగీకరించాడు. ఫలితంగా అతడి ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు డీపీఎల్‌ యాజమాన్యం తెలిపింది. 

కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడిన సమయంలోనూ హర్షిత్‌ రాణా ఇలాగే అతి చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ మయాంక్‌ అగర్వాల్‌ను అవుట్‌ చేయగానే ఫ్లైయింగ్‌ కిస్సులు ఇస్తూ ఓవరాక్షన్‌ చేసి.. మూల్యం చెల్లించాడు.

చదవండి: శుభవార్త పంచుకున్న హసీన్‌ జహాన్‌.. షమీపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)