Breaking News

ఐపీఎల్‌లో బ్యాన్‌.. కట్‌ చేస్తే! ఆ ఆటగాడికి కోట్లు కుమ్మరించిన కావ్య మారన్‌

Published on Thu, 12/11/2025 - 11:33

ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మార‌న్ భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసింది.  ఐపీఎల్ బ్యాన్ ఎదుర్కొంటున్న బ్రూక్‌కు సన్‌రైజర్స్ ఎలా ఆఫర్ చేసిందా అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే.

ఇంగ్లండ్‌కు చెందిన 'ది హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ (గతంలో  నార్తర్న్ సూపర్ ఛార్జర్స్) తమ రిటెన్షన్ పక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హ్యారీ బ్రూక్‌ను ఏకంగా 4,70,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 5.62 కోట్లు) వెచ్చించి రిటైన్ చేసుకుంది.

పేరు మార్పు..
ది హాండ్రెడ్ లీగ్ 2025 సీజన్‌కు ముందు నార్తరన్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీలో 49% వాటాను సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానులైన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగితా 1 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది.

కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో నార్తరన్ సూపర్‌చార్జర్స్ పేరును స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌గా మార్చారు. ఇక బ్రూక్ విష‌యానికి వ‌స్తే.. 2021 నుంచి స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో ఉన్నాడు. 

ఆ త‌ర్వాత 2024లో కెప్టెన్‌గా అత‌డు ఎంపిక‌య్యాడు. ఫ్రాంచైజీ త‌ర‌పున లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్‌గా బ్రూక్ కొన‌సాగుతున్నాడు. రాబోయో సీజ‌న్‌లో కూడా అత‌డు జ‌ట్టును ముందుండి న‌డిపించ‌నున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్‌ 2026 వేలం వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌ర‌గ‌నుంది.

ఐపీఎల్ నిషేధం
హ్యార్ బ్రూక్ ప్ర‌స్తుతం ఐపీఎల్ నిషేధం ఎదుర్కొంటున్నాడు.  ఐపీఎల్‌-2025  వేలంలో బ్రూక్‌ను రూ. 6.25 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజ‌న్ నుంచి త‌ప్పుకొంటున్న‌ట్లు బ్రూక్ తెలిపాడు.

అయితే బీసీసీఐ రూల్ ప్ర‌కారం.. సరైన కారణాలు లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారిపై నిషేధం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే బ్రూక్‌పై బీసీసీఐ వేటు వేసింది. హ్యారీ బ్రూక్ 2028 వేలం వరకు ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిందే.
చదవండి: BCCI: శుభ్‌మన్‌ గిల్‌కు మరో బిగ్‌ ప్రమోషన్‌..!
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)