Breaking News

విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

Published on Sat, 03/14/2026 - 13:09

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ చరిత్రకెక్కింది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.

ఆరో టైటిల్‌ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై (MI) ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. కాగా గతేడాది పద్నాలుగింట ఎనిమిది గెలిచిన ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

హార్దిక్‌కు పగ్గాలు
ఇదిలా ఉంటే... 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)ను ముంబై తమ కెప్టెన్‌గా నియమించింది. దీంతో రోహిత్‌ శర్మను తొలగించి అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల సొంతజట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్‌ను మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేశారు.

ఈసారి మంచి మార్కులే
ఆ ఏడాది ముంబై మరీ దారుణంగా పద్నాలుగుకు నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానానికే పరిమితమైంది. అయితే, గతేడాది ప్లే ఆఫ్స్‌ చేర్చిన హార్దిక్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు.. గత సీజన్లో రోహిత్‌ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలో దిగాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్‌లో కలిపి 418 పరుగులు సాధించాడు.

రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?
ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా- రోహిత్‌ శర్మకు సంబంధించి ఓ వదంతి పుట్టుకొచ్చింది. రోహిత్‌ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న హార్దిక్‌ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడని దాని సారాంశం. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్‌.. ‘‘ఐపీఎల్‌ 2026 ఆరంభానికి ముందు హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ శర్మకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈసారి రోహిత్‌ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోతే.. తాను సహించే ప్రసక్తే లేదని మేనేజ్‌మెంట్‌కు తేల్చి చెప్పాడు. యాజమాన్యం కూడా గత 10-12 ఏళ్లుగా రోహిత్‌ బ్యాటింగ్‌తో విసిగిపోయి ఉంది. అతడి స్ట్రైక్‌రేటు 120 కూడా దాటడం లేదు. ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఆటగాడి నుంచి ఈ ప్రవర్తన మేము ఊహించలేదని వాపోతోంది’’ అని పేర్కొన్నారు.

స్పందించిన ముంబై
ఈ ట్వీట్‌ వైరల్‌ కాగా.. ముంబై ఇండియన్స్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి స్వయంగా స్పందించింది. ‘‘అవునా.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జోడించి.. ఎవరికిష్టం వచ్చినట్లు వారు రాస్తారు అన్న అర్థంలో రూమర్లను కొట్టిపారేసింది. 

చదవండి: IPL 2026: సీఎస్‌కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)