Breaking News

హార్దిక్ పాండ్యా విధ్వంసం..

Published on Tue, 12/02/2025 - 16:38

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మం‍గళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.

ఆసియాకప్‌-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్‌తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.

తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్‌ శర్మ(47) మెరుపులు మెరిపించారు.

225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్‌కు ముం‍దు హార్దిక్‌ మరో రెండు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నాడు.
చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?



 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)