Breaking News

వారెవ్వా హార్దిక్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో

Published on Thu, 10/10/2024 - 12:32

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో 86 ప‌రుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.

దీంతో మరో మ్యాచ్ మిగిలూండ‌గానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవ‌సం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో బంగ్లా బ్యాట‌ర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియ‌న్‌కు పంపాడు.

సూపర్‌ మ్యాన్‌లా..
221 పరుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవ‌లం 91 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన రిషద్ హొస్సేన్ భార‌త బౌల‌ర్ల‌ను ఆడ‌టానికి కాస్త ఇబ్బంది ప‌డ్డాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు బాది ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌న్పించాడు.

ఈ క్ర‌మంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్ వేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడో బంతిని రిష‌ద్‌కు ఫుల్ డెలివ‌రీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. 

అయితే దాదాపు డీప్‌ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి  ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.

అతడి క్యాచ్‌ చూసిన బంగ్లా బ్యాటర్‌ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాం‍డ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)