Breaking News

శ్రీలంకతో వన్డే సిరీస్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌ దూరం

Published on Tue, 07/16/2024 - 11:56

శ్రీలంక ప‌ర్య‌ట‌నకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. శ్రీలంక‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో లంకతో​ వన్డే సిరీస్‌ దూరంగా ఉండాల‌ని పాండ్యా నిర్ణ‌యించ‌కున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకు హార్దిక్ తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. బీసీసీఐ కూడా హార్దిక్ నిర్ణ‌యాన్ని అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంకతో వన్డేలకు భార‌త రెగ్యూలర్‌  కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ కూడా దూరం కానున్నాడు.

ఈ క్ర‌మంలో లంక‌తో వ‌న్డే సిరీస్‌ల‌లో భార‌త జ‌ట్టు ప‌గ్గాల‌ను హార్దిక్ పాండ్య‌కు అప్ప‌గించాల‌ని సెల‌క్ట‌ర్లు భావించారు. కానీ అంత‌లోనే హార్దిక్ కూడా వన్డేలకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలని సెలక్టర్లు సతమతవుతున్నట్లు వినికిడి. 

ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశముంది. లంకేయులతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథిగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో శ్రీలంకతో తలపడనుంది.  పల్లెకెలె వేదిక‌గా జూలై 27న జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో టీమిండియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)