Breaking News

రోహిత్‌ వద్దు.. ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే!

Published on Sun, 06/25/2023 - 12:49

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హజరీలో పాండ్యానే టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్‌.. జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు.

ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా హార్దిక్‌ విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ తర్వాత వైట్‌బాల్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మను తప్పించి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా  హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

కాగా రోహిత్‌ భారత జట్టు పగ్గాలు చేపట్టాక...వరుసగా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్‌ రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు.

"వన్డే ప్రపంచకప్‌ తర్వాత వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీని హార్దిక్‌ పాండ్యా చేపట్టాలని నేను భావిస్తున్నాను. ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌ జట్టుకు రోహిత్ శర్మనే  నాయకత్వం వహించాలి. రోహిత్‌ కూడా అద్భుతమైన లీడర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మూడు ఫార్మాట్‌లలో జట్టును నడిపించడం అంత సులభం కాదు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది" అని ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్‌.. సెలక్టర్లకు కౌంటర్‌ ఇచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)