Breaking News

హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు!

Published on Sun, 08/02/2026 - 16:36

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల సోష‌ల్ మీడియాలో అభిమానులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. బిచ్చ‌గాళ్ల‌తో న‌టాషా ప్ర‌వ‌ర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విష‌యంలోకి వెళితే.. న‌టాషా స్టాంకోవిచ్ త‌న బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండ‌ర్ అలెక్స్‌తో క‌లిసి ఒక హోటల్‌కు వెళ్లింది. 

లంచ్ అనంత‌రం బ‌య‌టికి వ‌స్తున్న న‌టాషాతో కొంత‌మంది ఫొటోలు దిగారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి  పిల్ల‌ల‌తో క‌లిసి బిక్షాట‌న చేస్తున్న మ‌హిళ‌ల వ‌చ్చారు. త‌మ‌కు సాయం చేయ‌మ‌ని న‌టాషాను అడిగిన‌ప్ప‌టికీ, వారిని ప‌ట్టించుకోకుండా త‌న కారు ఎక్కి అక్క‌డినుంచి వెళ్లిపోవ‌డం కెమెరాల‌కు చిక్కింది. ఇంకేముంది, అస‌లే త‌మ అభిమాన క్రికెట‌ర్‌ను మోసం చేసి తెగ‌దెంపులు చేసుకున్న న‌టాషా ఎక్క‌డ దొరుకుతుందా అని కాచుకు కూర్చుకున్న కొంత‌మంది విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. 

'ఇదేం ప‌ద్ద‌తి.. ఫొటోల‌కు ఫోజివ్వ‌డం తెలుసు కాని ఒక రూపాయి ధ‌ర్మం చేయాల‌న్న క‌నీస జ్ఞానం లేదా' అని కామెంట్ల రూపంలో న‌టాషాను దెప్పిపొడిచారు. అయితే గతంలో పాండ్యాతో క‌లిసి ఉన్న‌ప్పుడు ఇదే న‌టాషా పేద వాళ్ల‌కు సాయం చేయ‌డంలో ముందు వ‌రుస‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించి, అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత 2020లో హార్దిక్ పాండ్యా, నటాషా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన నటాషా కుమారుడి పెంపకంపైనే దృష్టి సారించింది.

వివాహం తర్వాత కొంత కాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తర్వాత (2024)లో  పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు.

 

Read: 'అసంపూర్ణంగా భార‌తదేశ చిత్ర‌ప‌ఠం.. ఎందుకీ వివ‌క్ష‌?'

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)