Breaking News

నేను ఆడిన కెప్టెన్‌లలో అతడే అత్యుత్తమం: యష్ దయాల్

Published on Fri, 06/17/2022 - 15:56

గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ తమ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్‌లలో పాండ్యానే అత్యుత్తమ సారథని  అని యష్ దయాల్ తెలిపాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా ఎంపికయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను  ఛాంపియన్స్‌గా నిలిపి హార్ధిక్‌ చరిత్ర సృష్టించాడు.

“హార్దిక్ పాండ్యా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతడికి బాగా తెలుసు.  మనపై మనకు నమ్మకం ఉంటే అతడు మనల్ని స్వంత నిర్ణయాలు తీసుకునేలా సపోర్ట్‌ చేస్తాడు. అది బౌలర్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్‌లలో పాండ్యానే అత్యుత్తమ కెప్టెన్‌. అదే విధంగా ఆశిష్ నెహ్రా నాకు మొదటి నుంచి చాలా మద్దతుగా నిలిచాడు. టోర్నీ ఆరంభానికి ముందు నా బౌలింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని. కానీ ఆశిష్ సర్ నాకు ఒక సలహా ఇచ్చారు. మొదట ఓపెనర్లుకు ఒక విధంగా, డెత్‌ ఓవర్లలో సరైన ప్రణాళికతో బౌలింగ్‌ చేయమని చెప్పారు" అని యష్ దయాల్ పేర్కొన్నాడు.
చదవండి: William Porterfield Retirement: ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్‌ మూలస్థంభం

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)