Breaking News

'వాళ్లేం మాల్కం మార్షల్ కాదు'.. హార్దిక్‌, దూబేపై అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published on Tue, 02/24/2026 - 18:12

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా సెమీఫైన‌ల్‌కు చేరుతుందా?  లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెల‌కొంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్ ఘోరంగా ఓడిపోవ‌డంతో ప‌రిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ మూడో స్ధానంలో ఉంది. నెట్‌ర‌న్ రేట్‌(-3.800) భారీగా ప‌డిపోయింది.

దీంతో భార‌త్‌ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో భారీ విజ‌యాల‌తో పాటు, ఇతర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ భార‌త్ విఫ‌ల‌మైంది.

21 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన స‌ఫారీల‌ను భార‌త బౌల‌ర్లు ఆప‌లేక‌పోయారు. మిడిల్ ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటూ ఓట‌మిలో త‌మ వంతు పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలో భార‌త బౌలింగ్‌పై పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త వద్ద స‌రైన ఫాస్ట్ బౌల‌ర్లు లేర‌ని అక్త‌ర్ అన్నాడు. అదేవిధంగా  హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు.

"సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భార‌త బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అత‌డిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.

వారిద్ద‌రూ ఏమి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టే మాల్క‌మ్ మార్ష‌ల్‌లు కారు. డెత్ ఓవ‌ర్ల‌లో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. ప్రోటీస్‌తో మ్యాచ్‌లో అదే జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా 45 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ పేర్కొన్నాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)