వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?

Published on Sat, 06/24/2023 - 13:39

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌కు వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారాను పక్కన పెట్టడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అతడి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు తప్పుబడున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పటికి.. పుజారా ఒక్కడినే బలిపశువును చేయడం సరికాదు అని భారత ‍క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ సైతం విమర్శించాడు.

తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పుజారాకు మద్దతుగా నిలిచాడు. పుజారా వంటి అనుభవం ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

"విండీస్‌తో టెస్టులకు ఛతేశ్వర్‌ పుజారాను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు భారత జట్టుకు వెన్నెముక వంటి వాడు. చాలా మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడిని జట్టు నుంచి తప్పించకుండా కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుత భారత టెస్టు జట్టులో మిగితా బ్యాటర్లు సగటు కూడా అంతగా బాగోలేదు.

అటువంటి అప్పుడు పుజారా ఏం తప్పు చేశాడు. ఎంత పెద్ద ఆటగాడైనా ఆడకపోతే పుజారా లాగే జట్టు నుంచి తప్పించాలి. సెలక్టర్లు అలా చేయగలరా? మీరు పుజారాను కీలక ఆటగాడిగా పరిగణించకపోతే.. మిగితా ఆటగాళ్లు కూడా అంతకన్న తక్కువే.

పుజారా కెరీర్‌ గురించి మనం ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి విదేశీ గడ్డలపై భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు. అతడు 100కు పైగా టెస్టులు ఆడాడు. అటువంటి వ్యక్తి మీరు ఇలా చేయడం సరికాదు. అతడికి సరైన గౌరవం ఇవ్వాలి" అని భజ్జీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Sunil Gavaskar: వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు?

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)