Breaking News

ఆ ఇద్దరికి టీమిండియాకు ఆడే అవకాశం ఇవ్వండి.. బీసీసీఐకి హర్భజన్‌ విజ్ఞప్తి

Published on Wed, 05/17/2023 - 15:04

టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇద్దరు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐని అభ్యర్ధించాడు. ఐపీఎల్‌-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్‌ రింకూ సింగ్‌, రాజస్థాన్‌ యశస్వి జైస్వాల్‌లను లేట్‌ చేయకుండా టీమిండియాలోకి తీసుకోవాలని భజ్జీ కోరాడు. ఇప్పటికిప్పుడు రింకూ, యశస్విలను నేరుగా ఫైనల్‌ ఎలెవెన్‌లో (టీమిండియా) ఆడించాలని కోరడం లేదని, వారిని జట్టుకు దగ్గరగా తీసుకెళ్లాలన్నదే తన విజ్ఞప్తి అని తెలిపాడు. వారిరువురికి ప్రస్తుతమున్న ఫామ్‌లో అవకాశాలు కల్పిస్తే సత్తా చాటుతారని, సెలెక్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభిస్తే, అది వారితో పాటు టీమిండియాకు కూడా నష్టంగా పరిణించబడుతుందని అభిప్రాయపడ్డాడు.

ఆటగాళ్లు రాణిస్తున్నప్పుడు వారిని వ్యవస్థలో భాగం చేయాలని, నేరుగా వారిని తుది జట్టులో ఆడించకపోయినా, జట్టుకు దగ్గర చేస్తే ఖచ్చితంగా వారు తమలోని టాలెంట్‌ను మరింత మెరుగపర్చుకుంటారని అన్నాడు. కాగా, ఐపీఎల్‌ ప్రదర్శనల కారణంగా ఆటగాళ్లు టీమిండియా తలుపులు తట్టడం ఇది కొత్తేమీ కాదు. సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, హార్ధిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్లు సైతం ఇదే వేదికగా వెలుగులోకి వచ్చి నేడు టీమిండియాలో సుస్థిర స్థానాలు సంపాదించుకున్నారు.  

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లను మాజీలు, విశ్లేషకులు టీమిండియాకు రెకమెండ్‌ చేస్తున్నారు. వారిలో అత్యధిక భాగం రింకూ, యశస్విలను మద్దతు పలుకుతున్నారు. ఐపీఎల్‌ ప్రదర్శన కారణంగానే అజింక్య రహానే భారత టెస్ట్‌ జట్టులో చోటు సంపాదించడంతో ఈ వేదికపై సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలామంది యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితో యశస్వి జైస్వాల్‌ (13 మ్యాచ్‌ల్లో 575 పరుగులు), రింకూ సింగ్‌ (13 మ్యాచ్‌ల్లో 407 పరుగులు) ముందువరుసలో ఉన్నారు. 

చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్‌ సీరియస్‌ అయ్యాడు: సిరాజ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)