Breaking News

ధోని కంటే రోహిత్‌ బెటర్‌ కెప్టెన్‌: భారత స్పిన్‌ దిగ్గజం

Published on Thu, 10/03/2024 - 12:13

మహేంద్ర సింగ్‌ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌. అతడి సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్‌లోనూ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.. 2008లో మొదలైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆది నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్‌కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిపాడు. 

మరోవైపు.. రోహిత​ శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.

ధోని కంటే రోహిత్‌ బెటర్‌ కెప్టెన్‌
కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్‌లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్‌ బెటర్‌ కెప్టెన్‌ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..

ధోని ఎవరితో మాట్లాడడు
‘‘ఇద్దరిలో ఎవరు బెటర్‌ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్‌ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్‌ ప్లేయర్స్‌ కెప్టెన్‌. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.

అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్‌ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని  ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్‌ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)