Breaking News

వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్‌! ఆంధ్ర ఆటగాడి వైపే మొగ్గు

Published on Tue, 07/11/2023 - 14:46

దాదాపు నెల రోజుల విరామం తర్వాత భారత జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి జరగనున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌తో తలపడేందుకు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. 10 రోజుల ముందే కరీబియన్‌ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్‌ సేన.. ఈ సిరీస్‌ కోసం తీవ్రంగా శ్రమించింది.

డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో తొలి విజయమే లక్ష్యమే భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో విండీస్‌తో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కలేదు. అదే విధంగా యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు భజ్జీ చోటిచ్చాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌గా కిషన్‌కు కాకుండా ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ వైపే భజ్జీ మొగ్గు చూపాడు.

హర్భజన్ సింగ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. "వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ ప్రారంభించాలి. మూడో స్ధానంలో యువ ఆటగాడు జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలి. అయితే చాలా మంది ఓపెనర్‌గా గిల్‌ను కాకుండా జైశ్వాల్‌ను పంపాలని అభిప్రాయపడుతున్నారు. నావరకు అయితే అది సరైన నిర్ణయం కాదు.

ఎందుకంటే గిల్‌ ఓపెనర్‌ వచ్చి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు ఆ స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. కాబట్టి అతడి స్ధానాన్ని మార్చి ఏకగ్రాతను దెబ్బ తీయవద్దు. ఇక నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా కోహ్లి, రహానే బ్యాటింగ్‌కు వస్తారు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇక ఆరో స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడు.

ఏడో నెంబర్‌లో కేఎస్ భరత్ లేతా అశ్విన్ ఆడతారు. ఒకవేళ అశ్విన్‌ను ముందుగా పంపితే భరత్ 8వ స్థానంలో ఆడతాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ ఉంటాడు. అదే విధంగా దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన జయదేవ్‌ ఉనద్కట్‌కు అవకాశం ఇవ్వాలి. జట్టులో ఐదో పేసర్‌గా ముఖేష్‌ కుమార్‌ను తీసుకోవాలి" అని చెప్పుకొచ్చాడు.
హర్భజన్ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్
చదవండి
: Ind vs WI: జట్టు కోసం ఎంతో చేశాడు.. కానీ పాపం! వాళ్లు కూడా విఫలమయ్యారు.. అయినా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)