ఆ విషయంలో గిల్‌ తోపు.. రబాడ తక్కువేం కాదు!

Published on Mon, 06/01/2026 - 15:14

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఒక‌టిగా నిలిచిపోనుంది. 2022 సీజ‌న్ నుంచి స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజ‌న్ల‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేర‌డమంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. 

2022లో చాంపియ‌న్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ 2023లో ర‌న్న‌ర‌ప్‌గా, 2024 సీజ‌న్‌లో లీగ్ ద‌శ‌, 2025 సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌, తాజా సీజ‌న్‌లో మ‌రోసారి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో గుజ‌రాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుస‌గా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రేటింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. 

ఫైన‌ల్ ఆడిన తుది జ‌ట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆట‌గాళ్ల రేటింగ్‌ను విడుద‌ల చేశారు. 10 పాయింట్ల‌తో కూడిన రేటింగ్‌లో జ‌ట్టును అంతా తానై న‌డిపించిన కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్, బౌల‌ర్ క‌గిసో ర‌బాడ చెరో 9 పాయింట్ల‌తో తొలి స్థానంలో నిల‌వ‌గా, సాయి సుద‌ర్శ‌న్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాస‌న్ హోల్డ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ర‌షీద్ ఖాన్‌లు ఏడేసి పాయింట్ల‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. 

ఇక వికెట్ కీప‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ 6.5 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉండ‌గా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ప్ర‌సిధ్ కృష్ణ చెరో 6 పాయింట్ల‌తో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శ‌ర్మ‌, అర్ష‌ద్ ఖాన్‌లు చెరో 4 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా, 3 పాయింట్ల‌తో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.

ఈ సీజన్‌లో ద్ద‌గా ప్ర‌భావం చూప‌ని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్‌, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్‌తో ఆఖ‌రి స్థానాల్లో ఉన్నారు. లీగ్ ద‌శ‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. అయితే ఫైన‌ల్లో ఆర్సీబీ చేతిలో చ‌తికిల‌ప‌డిన గుజ‌రాత్ ర‌న్న‌ర‌ప్‌కు ప‌రిమిత‌మైంది.

చదవండి: 'కోహ్లీ కాస్త త‌గ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)