Breaking News

బుమ్రా కచ్చితంగా బ్యాటర్‌ అవుతాడు! ఇప్పుడివన్నీ అవసరమా?

Published on Mon, 09/04/2023 - 14:13

Jasprit Bumrah- Sanjana Ganesh Child: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా- స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చిన్నారి బుమ్రా కూడా క్రీడాకారుడు కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా బుమ్రా సతీమణి సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

తాము తల్లిదండ్రులు అయిన విషయాన్ని వీరు సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. కుమారుడికి అంగద్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సహచర క్రికెటర్లు సహా అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేర్లను ట్రెండ్‌ చేస్తున్నారు.

అంగద్‌ బ్యాటర్‌ అవుతాడేమో?
ఈ అందమైన ప్రపంచంలోకి అంగద్‌కు స్వాగతం అంటూ వెల్‌కమ్‌ చెబుతూ బెస్ట్‌ విషెస్‌ అందజేస్తున్నారు. ఇక మరికొంత మందైతే.. ఓ అడుగు ముందుకేసి చిన్నారి భవిష్యత్‌ గురించి జోస్యం చెబుతూ.. ‘‘అంగద్‌ తండ్రిలా బౌలర్‌ కాకుండా.. బ్యాటర్‌ అవుతాడు’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పుడే పుట్టిన ఫ్యూచర్‌పై ఇలాంటి కామెంట్లు అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు.

కొడుకును చూసుకునేందుకు స్వదేశానికి
కాగా బుమ్రా ప్రస్తుతం ఆసియా కప్‌-2023 టోర్నీతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఐర్లాండ్‌ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌స్టర్‌.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం శ్రీలంకకు వెళ్లాడు.

అయితే, భార్య ప్రసవం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన బుమ్రా.. మళ్లీ సూపర్‌-4 మ్యాచ్‌ల కోసం అక్కడికి వెళ్లనున్నాడు. దీంతో నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా 29 ఏళ్ల బుమ్రా 2021లో సంజనా గణేశన్‌ను వివాహమాడాడు.

చదవండి: WC 2023: తిలక్‌ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)