Breaking News

సాహో సాహా.. టెస్ట్‌ జట్టులో చోటు కన్ఫర్మ్‌.. రహానే లాగే..!

Published on Mon, 05/08/2023 - 09:29

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన గుజరాత్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. గుజరాత్‌ అభిమానులు ఈ వెటరన్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలో భారత ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టులో చోటు కన్ఫర్మ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐసీసీ ట్రోఫీ (డబ్ల్యూటీసీ) సాధించాలంటే టీమిండియాకు సాహా సేవలు చాలా అవసరమని అంటున్నారు.

వయసు (38) సాకుగా చూపి సాహాను విస్మరించొద్దని అంటున్నారు. ఎలాగూ కేఎల్‌ రాహుల్‌ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి, అతని స్థానంలో సాహాను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన  రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌తో పోలిస్తే సాహా చాలా బెటరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాహా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిస్తే టీమిండియాకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.

ఫార్మాట్‌కు తగ్గట్లుగా సాహా తన ఆటతీరును మార్చుకుంటాడని, అతనిలో టాలెంట్‌ను భారత సెలెక్టర్లు ఇకనైనా గుర్తించాలని అంటున్నారు. ఐపీఎల్‌లో అతను చేసిన సెంచరీని, దేశవాలీ క్రికెట్‌లో చేసిన ఫాస్టెస్ట్‌ సెంచరీని (20 బంతుల్లో 4 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 102) గుర్తించుకోవాలని కోరుతున్నారు. రహానే లాగే సాహా ఇన్నింగ్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. 

కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సాహాతో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (51 బంతుల్లో 94 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో గుజరాత్‌ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత​ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. డి కాక్‌ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్‌ మేయర్స్‌ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు.

అయితే 9వ ఓవర్‌లో మేయర్స్‌ ఔట్‌ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. డికాక్‌ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. 

చదవండి: IPL 2023: గిల్‌, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్‌ ఘన విజయం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)