Breaking News

SA vs AUS: ఆసీస్‌ బ్యాటర్ల సెంచరీల మోత.. ఏకంగా 432 పరుగుల టార్గెట్‌

Published on Sun, 08/24/2025 - 13:42

మెక్‌కే వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు భీబ‌త్సం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్‌, మిచెల్ మార్ష్‌, కామెరూన్ గ్రీన్ విధ్వంసక శతకాలతో కదం తొక్కారు. తొలుత మార్ష్‌, హెడ్ సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశారు. వారిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. వీరిద్దరూ తొలి వికెట్‌కు  250 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేయగా.. మార్ష్‌ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100  పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆ తర్వాత గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి విధ్వంసం ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. గ్రీన్ మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

ఈ ముగ్గురు సెంచరీల హీరీలతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(50) ఆర్ధశతకంతో రాణించాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్‌, ముత్తసామి తలా వికెట్లు సాధించారు. ఫాస్ట్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వియాన్ ముల్డర్ అయితే 7 ఓవర్లు బౌలింగ్ చేసి 93 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటికే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ కోల్పోయింది. ఇది కేవలం నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కసితో ఆసీస్ ఉంది.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా లెజెండ్‌..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)