విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కృనాల్‌ పాండ్యా

Published on Wed, 12/31/2025 - 15:28

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీకి గ్రేట్‌ న్యూస్‌ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో బ్యాట్‌తోనూ చెలరేగుతున్నాడు. 

ఈ టోర్నీలో వరుసగా బెంగాల్‌ (63 బంతుల్లో 57), ఉత్తర్‌ప్రదేశ్‌పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్‌ 31) హైదరాబాద్‌పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.

కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్‌కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్‌ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కృనాల్‌ జట్టు బరోడా భారీ స్కోర్‌ (417-4) చేసింది. 

ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్‌ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్‌ మిలింద్‌ 2, త్యాగరాజన్‌, వరుణ్‌ గౌడ్‌ తలో వికెట్‌ తీశారు.

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)