ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!

Published on Wed, 02/18/2026 - 09:14

భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఇరగదీస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా గెలవడంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌దే కీలక పాత్ర.

విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయినా.. ఇషాన్‌ (Ishan Kishan) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 77 పరుగులు సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్‌ (IND Beat PAK)ను చిత్తు చేయగా.. ఇషాన్‌ కిషన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఇషాన్‌ తాతయ్య అనురాగ్‌ పాండే ANIతో పేర్కొన్న విషయం తెలిసిందే.

అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్‌
‘‘ఇషాన్‌ ఎవరిని ఎంచుకున్నా ఆ అమ్మాయితోనే అతడి వివాహం జరిపించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్‌. ఆమె ఒక మోడల్‌. పిల్లలు కోరుకున్నది అందించడంలోనే పెద్దలకు సంతృప్తి, సంతోషం లభిస్తాయి’’ అని అనురాగ్‌ పాండే పేర్కొన్నారు. దీంతో ఇషాన్‌ త్వరలోనే పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వైరల్‌ అయ్యాయి.

ఆయన ముసలివారు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!
ఈ విషయంపై ఇషాన్‌ కిషన్‌ తల్లి సుచిత్రా దేవి స్పందించారు. ఇషాన్‌ వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు. ఆటపై మరింతగా దృష్టి పెట్టాల్సిన తరుణం. తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదు.

వాళ్ల తాతయ్య ముసలివారు అవుతున్నారు కదా!.. వృద్ధులకు మనుమల విషయాల పట్ల ఉత్సుకత కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వాటిని చూసే ఆయన అలా మాట్లాడారు. అంతకు మించి ఏమీలేదు’’ అని సుచిత్రా దేవి కొట్టిపారేశారు.

కష్టపడి.. రీఎంట్రీ
కాగా 27 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌ క్రమశిక్షణారాహిత్యం వల్ల దాదాపు మూడేళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి ఇటీవలే టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌ స్థానాన్ని భర్తీ చేసి.. అతడికి చెక్‌ పెట్టాడు.

ఇదిలా ఉంటే.. ఇషాన్‌ కిషన్‌.. అదితి హుండియా అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె రాజస్తాన్‌కు చెందిన వారని సమాచారం. ఇక వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సూపర్‌-8 చేరిన విషయం తెలిసిందే. 

చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)