Breaking News

భారత జట్ల శుభారంభం

Published on Thu, 09/12/2024 - 03:55

బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీలో మొరాకోతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–0తో గెలుపొందింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్, మహారాష్ట్ర గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

మొరాకో బలహీన ప్రత్యర్థి కావడంతో భారత బృందం ఈ మ్యాచ్‌లో గుకేశ్‌కు విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్‌ గేముల్లో ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో మొహమ్మద్‌ తిసిర్‌పై, అర్జున్‌ 40 ఎత్తుల్లో ఎల్బియా జాక్వెస్‌పై, విదిత్‌ 28 ఎత్తుల్లో మెహదీ పియరీపై, హరికృష్ణ 33 ఎత్తుల్లో అనస్‌ మొయాద్‌పై విజయం సాధించారు. మరోవైపు జమైకా జట్టుతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో గెలుపొందింది. 

తొలి రౌండ్‌ గేముల్లో వైశాలి 29 ఎత్తుల్లో క్లార్క్‌ అడానిపై, తానియా సచ్‌దేవ్‌ 41 ఎత్తుల్లో గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్‌ 76 ఎత్తుల్లో రాచెల్‌ మిల్లర్‌పై విజయం సాధించగా... రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్‌ 53 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత స్టార్‌ ద్రోణవల్లి హారికకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆతిథ్యమిచి్చన చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)