Breaking News

గ్లెన్ ఫిలిప్స్ సరికొత్త ప్రపంచ రికార్డు

Published on Sun, 11/01/2026 - 18:05

న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ గ్లెన్ ఫిలిప్స్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆదివారం హామిల్ట‌న్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన ఐదో టీ20లో ఫిలిప్స్ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 192 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌నలో ఫిలిప్స్ ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగాడు.

కేవ‌లం 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 65 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఫిలిప్స్‌ ఏకంగా నాలుగు సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. ఈ కివీస్ సూపర్ స్టార్ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో  341 పరుగులు చేశాడు.

సాల్ట్ వరల్డ్ రికార్డ్ బ్రేక్‌
ఈ క్రమంలో ఫిలిప్స్ ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ‍ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఫిలిప్స్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ (2023లో వెస్టిండీస్‌పై 331 పరుగులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో సాల్ట్ వరల్డ్ రికార్డును ఫిలిప్స్ ‍బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఒక క్యాలెండర్ ఈయర్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ ఫిలిప్స్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే

341* గ్లెన్‌. ఫిలిప్స్ (భారత్‌తో, 2026)
331 ఫిల్‌. సాల్ట్ (వెస్టిండీస్‌తో, 2023)
316 మహ్మద్ రిజ్వాన్ (ఇంగ్లాండ్‌తో, 2022)
297 సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) (సైప్రస్‌తో, 2024)
290 ఎం. చాప్‌మన్ (పాకిస్థాన్‌తో, 2023)

ఒక క్యాలెండర్ ఈయర్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై సాధించిన అత్యధిక పరుగులు

గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) - భారత్‌పై 522 పరుగులు (2026)

అభిషేక్ శర్మ (భారత్) - న్యూజిలాండ్‌పై 431 పరుగులు (2026)

సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - శ్రీలంకపై 398 పరుగులు (2026)

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)