చరిత్ర సృష్టించిన ఫిలిప్స్‌.. తొలి ఆటగాడిగా! 15 ఏళ్లలో

Published on Sat, 03/02/2024 - 15:06

వెల్లింగ్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా ఎటాక్‌లోకి వచ్చిన ఫిలిప్స్‌ తన స్పిన్‌ మయాజాలంతో ఆసీస్‌ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్‌ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్‌ చేసిన గ్లెన్‌.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. 

అందులో 4 మెయిడిన్‌ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్‌ త​మ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్‌ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా ఫిలిప్స్‌ నిలిచాడు.

ఆఖరిగా 2008లో బ్లాక్‌ క్యాప్స్‌ స్పిన్నర్‌ జీతన్‌ పటేల్‌ 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆసీస్‌ కివీస్‌ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది.
చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్‌- రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)