Breaking News

చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌..! మెక్‌గ్రాత్‌ రియాక్షన్‌ వైరల్‌

Published on Thu, 12/18/2025 - 10:51

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌల‌ర్‌గా లియోన్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జ‌రుగుతున్న మూడో టెస్టులో లియోన్ ఈ ఫీట్ సాధించాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 141 మ్యాచ్‌ల‌లో 564 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇంత‌కుముందు ఈ అరుదైన రికార్డు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్‌ను లియోన్ అధిగ‌మించాడు. అగ్ర‌స్దానంలో దివంగ‌త స్పిన్న‌ర్ షేన్ వార్న్‌(708) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు సాధించిన జాబితాలో లియోన్ ఆరో స్ధానానికి ఎగ‌బాకాడు. 

ఈ లిస్ట్‌లో ముత్తయ్య మురళీధరన్ (800) టాప్ ప్లేస్‌లో ఉండ‌గా.. షేన్ వార్న్ 708, జేమ్స్ అండర్సన్ 704, అనిల్ కుంబ్లే 619, స్టువర్ట్ బ్రాడ్ 604  త‌ర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ దిగ్గ‌జ బౌలర్లు అందరూ రిటైర్డ్ కాగా.. లయన్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.

మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్‌..!
కాగా త‌న రికార్డును బ్రేక్ చేసిన స‌మ‌యంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంటరీ బాక్స్‌లో ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా మెక్‌గ్రాత్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లియోన్ వికెట్ తీయ‌గానే.. మెక్‌గ్రాత్ స‌రద‌గా ‘కుర్చీని విసిరేస్తున్నట్లు’రియాక్ట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వెంట‌నే ఈ లెజెండ‌రీ ఫాస్ట్ బౌల‌ర్‌ న‌వ్వుతూ లియోన్‌ను అభినందించాడు.

చదవండి: IND vs SA: క్రికెట్ వ‌ర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!

 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)